అసెంబ్లీలో టీడీపీ దూకుడు.. ప్లాన్-1-2-3 ఇదే..!

-

ఈ నెల 16 నుంచి ప్రారంభం అవుతున్న అసెంబ్లీ స‌మావేశాల్లో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించేందుకు ప్ర‌ధా న ప్ర‌తిప‌క్షం టీడీపీ ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది. మొత్తంగా మూడు రోజుల‌కు మించ‌కుండా జ‌గ‌న్ ప్ర‌భుత్వం బ‌డ్జెట్ స‌మావేశాల‌కు ప్లాన్ చేసింది. మంగ‌ళ‌వారం ప్రారంభం రోజే.. బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టాల‌ని నిర్ణ యించింది. అనంత‌రం, దీనిపై అధ్య‌య‌నానికి ఒక‌రోజు సెల‌వు ఉంటుంది. త‌ర్వాత రోజు స‌భ ఉంటుం ది. అ యితే, ఈ స‌మావేశాల్లో చంద్ర‌బాబు వ్యూహం మేర‌కు.. త‌న పార్టీ నేత‌ల‌ను అరెస్టు చేయ‌డంపై ప్ర శ్నించ‌నున్నారు.

ముఖ్యంగా అచ్చెన్నాయుడు అరెస్టును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకునే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. స‌భ‌లోను, బ‌య‌టా కూడా పార్టీకి అత్యంత కీల‌క‌మైన నాయ‌కుడు కావ‌డంతో చంద్ర‌బాబు ఈ విష‌యాన్ని అసెంబ్లీలో లేవ‌నెత్తుతార‌ని అంటున్నారు. ఇప్ప‌టికే దీనికి సంబంధించి పార్టీ నేత‌ల‌తో చంద్ర‌బాబు మంత‌నాలు పూర్తి చేశారు. ఎవ‌రెవ‌రు ఏయే విష‌యాల‌పై మాట్లాడాలో కూడా చంద్ర‌బాబు ప్లాన్ చేసుకున్నారు. అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వానికి కోర్టుల నుంచి ఎదుర‌వుతున్న తీర్పుల‌పై కూడా ప్ర‌శ్నించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ముఖ్యంగా బీసీలు, ఎస్సీ(డాక్ట‌ర్ సుధాక‌ర్ విష‌యం)ల విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అవ‌లంబిస్తున్నతీరును ఎండ‌గ‌ట్టాల‌ని బాబు భావిస్తున్నారు. అయితే, స‌భ‌లో ఆయ‌న‌కు ఇవ‌న్నీ చ‌ర్చించేందుకు, ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డేందుకు అవ‌కాశం ఉంటుందా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఉన్న ‌దే చాలా త‌క్కువ స‌మ‌యం.. అది కూడా రాబోయే 9 నెల‌లకు బ‌డ్జెన్ ప్ర‌వేశ పెట్టి ఆమోదించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. సో.. చంద్ర‌బాబుకు అవ‌కాశం ద‌క్కే సంద‌ర్భాలు క‌ష్ట‌మే. మ‌రి దీనిని బ‌ట్టి ఆయ‌న ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version