‘భానుమతి రామకృష్ణ’పోస్టర్‌ను విడుదల చేసిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ …!

-

హీరోగా నవీన్ చంద్ర కి తెలుగులో చక్కటి పేరుంది. అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయమైన నవీన్ చంద్ర ఆ తర్వాత ఎన్నో సినిమాలలో మంచి పాత్రలు పోషించాడు. మరోసారి ‘భానుమతి రామకృష్ణ’సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాని అల్లు అరవింద్ “ఆహా” లో స్ట్రీమింగ్ కాబోతుండటం విశేషం. భిన్న మనస్తత్వాలు కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ మొదలైతే ఎలా ఉంటుందన్న కథాశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో నవీన్ చంద్రకి జంటగా భానుమతి పాత్రలో సలోని లూథ్రా నటించింది.

 

ఇక రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్ కి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్ వచ్చింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. రొమాంటిక్ డ్రామాగా రూపుందిన ఈ సినిమా జూలై 3న ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్ షో కి రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాకి శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించాడు. తాజాగా టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు.

 

ఈ సందర్భంగా అల్లు అరవింద్.. చాలా కాలం తరువాత ఒక అందమైన ప్రేమకథను చూస్తున్నట్లు అనిపించింది. 30 ఏళ్ళ వయసులో ఉన్న పరిణితి చెందిన అమ్మాయి అబ్బాయి ప్రేమ కథను చూడటం ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి కథలు మనం తరచుగా చూడనిది. మొదటిసారిగా ఈ చిత్రం ఆహాలో విడుదల అవుతున్నందుకు సంతోషంగా ఉందంటూ చిత్ర బృందాని శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ సినిమాని క్రిషివ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించగా నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై శరత్ మరార్ సమర్పిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version