రాబోయే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ కోసం అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తాజాగా అనకాపల్లి జిల్లా మాడుగులలో నిర్వహించిన రా కదలి రా.. సభలో చంద్రబాబు మాట్లాడారు. కేవలం 64 రోజుల్లోనే తమ ప్రభుత్వం రాబోతుందని చెప్పారు.బటన్ నొక్కుతున్నానని సీఎం జగన్ గొప్పలు చెబుతున్నారన్నారు. కానీ బటన్ నొక్కుడు కాదు.. నీ బొక్కుడు సంగతి ఏంటి..? అని ప్రశ్నించారు. ఆయన పుణ్యం వల్లనే చెత్త పన్ను వచ్చిందని ఎద్దేవా చేసారు.
ఈ ఎన్నికల్లో రాష్ట్రం.. ప్రజలు గెలివాలన్నారు. సైకో పాలన అంతం చేస్తే.. తప్ప మనకు భవిష్యత్ లేదు అన్నారు. ఇలాంటి సీఎంను నా జీవింలో చూడలేదన్నారు. ప్రజలపై భారం వేసిన గజదొంగ జగన్ మోహన్ రెడ్డి.. కరెంట్ ఛార్జీలు పెంచి రూ.64వేల కోట్ల భారం మోపారు. జగన్ బటన్ నొక్కుడుతో ఒక్కో కుటుంబం రూ.8లక్షలు నష్టపోయింది. జాబ్ క్యాలెండర్, మద్య నిషేదం, సీపీఎస్ రద్దు, రైతు ఆత్మహత్యలు ఆపేందుకు ఎందుకు బటన్ నొక్కలేదని ప్రశ్నించారు. ఈ విషయాలను ప్రజలు తెలుసుకోవాలని సూచించారు. జాబ్ రావాలంటే బాబు రావాల్సిందేనన్నారు.