వరద బాధితులకు మరో శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కరెంట్ బిల్లుల చెల్లింపుల విషయంలో కీలక ప్రకటన చేశారు. విద్యుత్ బిల్లుల వసూలు వాయిదా వేయాలని విద్యుత్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వరద బాధిత ప్రాంతాలలో సెప్టెంబర్ నెల విద్యుత్ బిల్లుల వసూలు వాయిదా వేస్తామని… తాజాగా చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. ప్రతి ఇంటికి ఎలక్ట్రీషియన్, అలాగే ప్లంబర్ను పంపిస్తామని కూడా తెలిపారు. అదే సమయంలో మెకానిక్ కూడా కావాలి కాబట్టి వాళ్లను కూడా పంపిస్తామని చంద్రబాబు నాయుడు వివరించారు.
అయితే వాళ్లు ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేయకుండా చూస్తామని తెలిపారు చంద్రబాబు నాయుడు. అందరికీ ఒక ధర నిర్ణయిస్తామని ఈ వివరించారు. అవసరమైతే రాయితీ కూడా ప్రకటిస్తామన్నారు. ఆన్లైన్లో నమోదు చేసుకుంటే మనుషుల్ని పంపిస్తామని కూడా చంద్రబాబు వివరించడం జరిగింది. దీంతో వరద బాధితులకు కాస్త ఊరట లభించనుంది. ఇది ఇలా ఉండగా విజయవాడ వాసులను కాపాడేందుకు ఆరవ రోజు కూడా విజయవాడ కలెక్టరేట్లోనే చంద్రబాబు నాయుడు ఉంటున్నారు. అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు.