రోడ్లపై ఉన్న గొయ్యల్లో వైసీపీ నేతలను పూడ్చాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ పోలవరంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా దార్లపూడి పోలవరం కెనాల్ దగ్గర ప్రజలతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. నార్త్ కొరియా లో నవ్వినా, ఏడ్చినా కొట్టే కిమ్ లాంటి జిమ్ మన రాష్ట్రంలో ఉన్నాడు… మనకు ఆర్థిక వెసులు బాటు కల్పించాల్సిన బాధ్యత ఎన్ డీ ఏ పై ఉందని ఆగ్రహించారు.
విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణ ను నేను ఒప్పుకున్నామని చెబుతున్నారని ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ చెప్పేవి అన్నీ అబద్ధాలే… మీ మనోభావాలకు అనుగుణంగా పాలన చేస్తామన్నారు. పెన్షన్ లను పెంచాం, మెగా డీ ఎస్ సీ ఇచ్చాం, ల్యాండ్ గ్రాబ్బింగ్ యాక్ట్ ను రద్దు చేశామని… పెట్టుబడులు పెట్టే వాళ్ళు రాష్ట్రంలోని భూతం గురుంచి భయపడుతూ ఉన్నారని వివరించారు. ఆ భూతాన్ని నియంత్రించే భూత వైద్యులు ప్రజలే దాన్ని చూసుకుంటారు.. రోడ్లపై ఉన్న గొయ్యల్లో వైఎస్ఆర్సీపీ నేతలను పూడ్చాలని హెచ్చరించారు. గొయ్యిలపాలైన రాష్ట్రాన్ని ఏం చేయాలో తెలియడం లేదని తెలిపారు.