ఏపీ కంటే తెలంగాణ ఆదాయం రూ.37,259 కోట్లు ఎక్కువ

-

ఏపీ కంటే తెలంగాణ ఆదాయం రూ.37,259 కోట్లు ఎక్కువ అన్నారు నారా చంద్రబాబు నాయుడు. 2019లో AP రెవెన్యూ రూ. 66786 కోట్లు…తెలంగాణ రెవెన్యూ రూ. 69620 కోట్లు అని… 2022- 23కు వచ్చే నాటికి ఏపీ రెవెన్యూ రూ.94916 కోట్లు కాగా.. తెలంగాణ ఆదాయం రూ. 132175 కోట్లకు చేరుకుందని చెప్పారు. ఏపీ కంటే తెలంగాణ ఆదాయం రూ.37,259 కోట్లు ఎక్కువ అని వెల్లడించారు చంద్రబాబు.

వివేకా హత్య కేసులో అసలు దోషి జగనే అని CBI అఫిడవిట్ తో తేలి పోయిందన్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. వివేకా హత్య కేసు లో సిబిఐ అఫిడవిట్ లో అసలు విషయాలు చెప్పారని, వివేకాను హత్య చేసి ఊసరవెల్లిని మించి వేషాలు వేశారన్నారు. అంతేకాకుండా.. ‘ఇప్పటి వరకు వివేకా హత్య లో రోజుకో మాయ మాట చెప్పారని తేలిపోయింది. నాడు వీళ్లు హత్య చేసి నాపై నెపం వేసి…నారా సుర రక్త చరిత్ర అని రాశారు. ఎన్నికల్లో లబ్దిపొందారు. వివేకా హత్య కేసులో జగనే ప్రధాన నిందితుడు. వివేకా హత్య విషయం బయట ప్రపంచానికి తెలియక ముందే జగన్ కు తెలుసని సిబిఐ స్వయంగా చెప్పిందన్నారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Exit mobile version