కేంద్ర నిర్ణయంపై పూర్తి అధ్యయనం తర్వాత స్పందిస్తా: చంద్రబాబు

కృష్ణా: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటిస్తున్నారు. టీడీపీ నేత బచ్చుల అర్జునుడు గుండె పోటుకు గురైన విషయం తెలిసిందే. రమేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బచ్చుల అర్జునుడిని చంద్రబాబు నాయుడు పరామర్శించారు.

ఈ సందర్బంగా జలవివాదాలపై కేంద్రప్రభుత్వం విడుదల చేసిన గెజిటెడ్‌పై చంద్రబాబు స్పందించారు. తెలుగు రాష్ట్రాల నీటి అవసరాలపై లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. సీమ వాసులకు నీటి విషయంలో తీసుకున్న నిర్ణయం లాభదాయకం కాదన్నారు. ఏపీ ప్రయోజనాలను కాపాడే చర్యలు తీసుకోవాలని చెప్పారు. కేంద్రం విడుదల చేసిన గెజిట్ పై పూర్తిగా అధ్యయనం చేశాకే స్పందిస్తానని చంద్రబాబు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పారిపోయే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. సీఎం జగన్ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ఎంతవరకైనా పోరాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు.