ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో భారీ మార్పులు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ప్రక్షాళన చేపట్టనున్నారు సీఎం చంద్రబాబు. మొత్తంగా ఏపీలో 10960 గ్రామ సచివాలయాలు, 4044 వార్డు సచివాలయాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే.
గ్రామ వార్డు సచివాలయాల్లో 1.61 లక్షల గ్రామ, వార్డు సెక్రటరీలు పనిచేస్తున్నారు. అయితే.. అవసరాలకు అనుగుణంగా గ్రామ, వార్డు సెక్రటరీలను వినియోగించుకునేలా కసరత్తు చేస్తున్నారు సీఎం చంద్రబాబు.. గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల్లో రేషనలైజేషన్ పాటించేలా ప్రతిపాదనలు తీసుకొచ్చారు బాబు. పట్టణ పరిధిలోని వార్డుల్లో అడ్మిన్, శానిటరీ, విద్యా, సంక్షేమం, సౌకర్యాలు, ఆరోగ్య, మహిళా సంరక్షణ కార్యదర్శులు ఉండేలా సూచనలు చేశారట సీఎం చంద్రబాబు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.