సీఎం రేవంత్ రెడ్డి గారి విదేశీ పర్యటన షెడ్యూల్ లో ఎలాంటి మార్పు లేదని… ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రకటన చేసింది. సీఎం రేవంత్ రెడ్డి గారి విదేశీ పర్యటన రద్దు అయిందని ప్రచారం జరిగింది. దీనిపై తెలంగాణ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విదేశీ పర్యటన షెడ్యూల్ లో ఎలాంటి మార్పు లేదు.
ఆకస్మికంగా ముఖ్యమంత్రి తన పర్యటన రద్దు చేసుకున్నారంటూ బీఆరెస్ సోషల్ మీడియా పనిగట్టుకుని చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరింది సర్కార్. అవాస్తవాలను ప్రచారం చేస్తూ మీడియాను, ప్రజలను గందరగోళంలో పడేసే ప్రయత్నం చేస్తున్న వారి ట్రాప్ లో పడొద్దు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు షెడ్యూల్ ప్రకారం తన పర్యటన పూర్తి చేసుకున్న తరువాతే రాష్ట్రానికి చేరుకుంటారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13న తన పర్యటన ముగించుకుని 14న ఉదయానికల్లా హైదరాబాద్ చేరుకుంటారు. దయచేసి గమనించగలరు అంటూ ప్రకటన చేసింది.