టీడీపీ అధ్యక్ష పదవి ఈసారి బీసీకే… క్యాండిడేట్ ఫిక్స్!

-

సాధారణంగా మహానాడు వేదికపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు సంబందించి ప్రతిపాదనలు, అనంతరం వాటిని బలపరచడాలు జరుగుతుంటాయి. కానీ 2019 లో ఎన్నికల దెబ్బ, 2020 లో కరోనా దెబ్బ కారణంగా తాజా ఆన్ లైన్ మహానాడులో ఆ కార్యక్రమం జరగలేదు. దీంతో ఈ పదవిలో ఎవరిని నియమించాలనే దానిపై చంద్రబాబు తర్జనభర్జనలు పడుతున్నారని తెలుస్తుంది. ప్రతీ విషయంలోనూ క్యాస్ట్ లెక్కలు పక్కాగా వేయాలని భావించే బాబు… మహానాడు వేదికగా బీసీల పల్లవి అందుకున్న క్రమంలో… ఈ సారి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి బీసీకే ఇవ్వాలని నిర్ణయించుకున్నారంట. ఈ క్రమంలో అచ్చెన్నాయుడికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

అచ్చెన్నాయుడు మినహా టీడీపీలో మరెవరూ బీసీల్లో అర్హులు లేరా అంటే… గతంలో మంత్రులుగా పనిచేసిన సీనియర్లు ఎంతో మంది ఉన్నారు! అయినా కూడా అచ్చెన్నకే ఇవ్వాలనే ఆలోచనలో.. గెలిచిన వారికే ఇవ్వాలని లాజిక్ లాగుతున్నారట బాబు! ప్రస్తుతం అధ్యక్షుడుగా ఉన్న కళా వెంకట్రావును తప్పించాలని ఇప్పటికే ఎప్పుడో నిర్ణయించుకున్నారన్న వార్తలు వచ్చిన తరుణంలో… అధికారంలో ఉన్నప్పుడు ఆ పదవిలో ఉన్నవారి అవసరం పెద్దగా లేకపోయినా.. ప్రతిపక్షంలో ఉన్నాప్పుడు చాలా అవసరమే ఉంటుందని బాబు భావించి, అందుకు మైకుల ముందు బలంగా మాట్లాడగలిగే నాయకుడైతే మేలని భావిస్తున్నారంట.

ఈ లెక్కన బీసీలకు తమ పార్టీ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పుకున్నట్లూ అవుతుంది, కళాను తప్పించినట్లూ అవుతుంది, అచ్చెన్నాకు అవకాశం ఇచ్చినట్లూ అవుతుందని బాబు భావిస్తున్నారంట. నిజానికి మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షుడు, జాతీయ కమిటీ, ఏపీ, తెలంగాణ అధ్యక్షులు, కమిటీల ఎన్నికను పూర్తిచేస్తుంటారు. కానీ, కరోనా పేరుతో వాటన్నింటినీ వాయిదా వేశారు. జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎంపిక లాంఛనమే అయినా ఏపీ అధ్యక్షుడి ఎంపికపైనే ఆసక్తి నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news