Chandrababu: నేడు సీఎం హోదాలో గౌరవ సభకు ఏపీ సీఎం చంద్రబాబు రానున్నారు. మళ్లీ సీఎంగానే సభకు వస్తానని 2021 నవంబర్ 19న సభలో శపథం చేసిన చంద్రబాబు…అన్నంత పని చేశారు. నాటి అధికార పక్షం తన కుటుంబ సభ్యులపై దారుణ వ్యాఖ్యలతో సభనుంచి అవేదనతో బయటకు వెళ్లారు చంద్రబాబు.

ఇది శాసన సభ కాదు.. ఇది కౌరవ సభ.. తిరిగి గౌరవ సభగానే వస్తానంటూ నాడు బయటకు వెళ్లిపోయిన చంద్రబాబు….2021 నవంబర్ 19 తరువాత మళ్లీ అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. ఇక 4 సారి ముఖ్యమంత్రిగా నేడు సగర్వంగా సభకు చంద్రబాబు వస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో 164 మంది కూటమి సభ్యుల మధ్య సభలోకి అడుగుపెట్టనున్నారు చంద్రబాబు. కాగా, ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ బుధవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఇవాళ ఉదయం 9.46 నిమిషాలకు ఏపీ అసెంబ్లీ సెషన్ ప్రారంభం అవుతోందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.