నేడు తెలుగుదేశం పార్టీ.. 40 వ ఆవిర్భావ దినోత్సవం. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సంచలన ట్వీట్ చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు, అభిమానులందరికీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు.. నలభై సంవత్సరాల క్రితం 1982, మార్చి 29న ఎన్టీఆర్ చేతుల మీదుగా తెలుగుదేశం ఆవిర్భావం….ఒక రాజకీయ అనివార్యం అని వెల్లడించారు.
కొందరు వ్యక్తుల కోసమో…కొందరికి పదవుల కోసమో ఏర్పడిన పార్టీ కాదు మన తెలుగుదేశమని… ప్రజల కోసం…ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం అని కొనియాడారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ నినాదంతో నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం….ఈ 40 ఏళ్లలో సామాన్య ప్రజల జీవితాల్లో పెను మార్పులు తెచ్చిందన్నారు.
ప్రాంతీయ పార్టీ గా ఉన్నా….జాతీయ భావాలతో సాగే పార్టీ టీడీపీ అని ప్రకటన చేశారు. పార్టీ చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తుకుతెచ్చేలా తెలుగుదేశం 40 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించాలని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పునరంకితం అయ్యేలా ఈ వేడుకలు ఉండాలని… రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అవసరం ఏంటో ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు సాగాలని కోరారు.
కొందరికే పరిమితం అయిన అధికారాన్ని అన్ని వర్గాలకు పంచింది. తెలుగుదేశం అంటేనే అభివృద్ధి..సంక్షేమం. సంస్కరణల ఫలితాలను గ్రామ స్థాయికి అందించిన చరిత్ర టీడీపీదే.పాలనపై పాలకులను ప్రశ్నించే తత్వాన్ని ప్రజలకు నేర్పింది తెలుగుదేశమే.(3/5)#40GloriousYearsOfTeluguDesam#TDPFoundationDay
— N Chandrababu Naidu (@ncbn) March 29, 2022