పేదరిక నిర్మూలనే అసలు సిసలైన రాజకీయంగా ఎన్టీఆర్ ప్రజాసేవ : చంద్రబాబు

-

కృష్ణా జిల్లాలోని నిమ్మకూరులో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహాలకు టీడీపీ నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. పేదరిక నిర్మూలనకు టీడీపీ మెని ఫెస్టోలో పెట్టిన పూర్ టు రిచ్ లక్ష్యాలను ఆవిష్కరించారు. నిమ్మకూరు గ్రామంలో నందమూరి వంశీకులు, బంధువుల ఇళ్లకు వెళ్లి ఆయన ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంపద సృష్టించి.. అది పేదలు అనుభవించేలా చేయడమే పేదరిక నిర్మూలన ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమన్నారు. మన ఊరు పిల్లలు ప్రపంచానికి పని చేసి డబ్బులు సంపాదించే విధంగా ఈ ప్రాజెక్టులో ఓ భాగం మాత్రమే. పేదరిక నిర్మూలనే అసలు సిసలైన రాజకీయంగా ఎన్టీఆర్ ప్రజా సేవ చేశారని చంద్రబాబు తెలిపారు. 

ఎన్టీఆర్ స్పూర్తితోనే పేదరిక నిర్మూలన ప్రాజెక్టును ఆయన స్వగ్రామం నిమ్మకూరులో ప్రారంభిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.మన గ్రామాలను ప్రపంచానికి అనుసంధానం చేసే వినూత్న కార్యక్రమమే ఈ పూర్ టు రిచ్.. నిమ్మకూరులో ప్రయోగాత్మకంగా ప్రారంభించే పేదరిక నిర్మూలన కార్యక్రమం అందరికీ మార్గదర్శకం కానుందని చెప్పారు. సమాజం వల్ల బాగుపడిన వాళ్లు తమ ఊర్లో ఒక కుటుంబాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకునేవిధంగా కార్యక్రమాలు చేపడుతామన్నారు. ప్రభుత్వం ప్రజలు ప్రైవేట్ భాగస్వామ్యంతో మన ఊర్లో పుట్టిన వారు మనతో సమానంగా పైకి తీసుకొచ్చేవిధంగా ఈ ప్రాజెక్టు పని చేస్తుందని తెలిపారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news