చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా రాదు : కొడాలి నాని

-

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వై.ఎస్ షర్మిల పై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు మతి భ్రమించింది. ప్రజలకు ఏం చేస్తారో కూడా చెప్పలేక జగన్ ను తిడుతున్నారు. 2019లోనే చంద్రబాబును ప్రజలు హైదరాబాద్ కి పంపించేశారు. సీట్లు రాని, మేము తీసేసిన వాళ్లు టీడీపీలో చేరుతున్నారు. చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదు అన్నారు.

వైసీపీ కొత్త మేనిఫెస్టోతో  చంద్రబాబుకు దిమ్మతిరిగేలా చేస్తామని తెలిపారు. పదవీ కోసమే జగన్ పై షర్మిల నిందలు వేశారని పేర్కొన్నారు. తెలంగాణలో పాదయాత్ర చేసి ఏం చేసిందో అందరికీ తెలిసిందే అన్నారు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఆశయాలు సాధిస్తానని షర్మిల ఏం చేసింది..? అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ కోసం పుట్టానని ఇప్పుడు షర్మిల చెబుతున్నారు. అసలు షర్మిలకు స్టీల్ ప్లాంట్, పోలవరం ఇప్పుడు గుర్తుకువచ్చాయా..? అని ప్రశ్నించారు కొడాలి నాని.

Read more RELATED
Recommended to you

Exit mobile version