BREAKING : చంద్రబాబు బెయిల్‌పై విచారణ ఈ నెల 17కు వాయిదా

-

BREAKING : చంద్రబాబు బెయిల్‌పై విచారణ ఈ నెల 17కు వాయిదా పడింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడుకు మరోసారి షాక్ తగిలింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. ఈనెల 17వ తేదీన విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది.

AP High Court refused to hear the lunch motion petition
AP High Court refused to hear the lunch motion petition

అలాగే ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సి ఐ డి ని కూడా ఆదేశించింది ఏపీ హై కోర్టు. ఇదే కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్ ను కొట్టేయడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఇప్పుడు ఏపీ హైకోర్టులో కూడా చంద్రబాబు నాయుడుకు భారీ షాక్ తగిలింది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 33 రోజుల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news