ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతిపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించింది. ఇరిగేషన్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినీతిపై దృష్టి సారించిన ఏపీ సర్కారు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. జలవనరుల శాఖను వైసీపీ పాలకులు దుర్వినియోగం చేశారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఆవులుపల్లి ప్రాజెక్టులో పెద్దిరెడ్డి పాపాలు అన్నీ ఇన్నీ కాదని ఆరోపించారు. అవులుపల్లి ప్రాజెక్టులో పెద్దిరెడ్డి రూ. 600 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్జీటీ నిబంధనలకు విరుద్ధంగా ఆవులుపల్లి ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్నారు. ఎన్జీటీ కోట్లాది రూపాయల జరిమానా విధించిందన్న మంత్రి.. ఆవులుపల్లి సహా ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఏమైనా అవినీతి జరిగిందా..? అనే అంశంపై వివరాలు తీసుకుంటున్నామన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు కలల ప్రాజెక్టులు పూర్తి చేసి ఆయన లక్ష్యం నిరవేర్చేలా పని చేస్తామన్నారు. జల సమర్థంగా నిర్వర్తించడం అంటే రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకునే అవకాశమేనని ఆయన పేర్కొన్నారు. అలాంటి అవకా జగన్మోహన్ రెడ్డి కోల్పోవడంతో పాటు ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి తీరని ద్రోహం చేశాడన్నారు. జగన్ ఆ నాలోచిత నిర్ణయాలు వల్ల కృష్ణా నదీ జలాలపై అంతర్రాష్ట్ర వివాదం తలెత్తిందన్నారు. జగన్ పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేశాడని మేము చెప్పటం కాదు.. నీతి ఆయోగ్ కమిటీనే ధృవీకరించిందన్నారు. కీలక శాఖకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి పాదాభివందనం తెలుపుతున్నానన్నారు. తనకు ఈ శాఖ కేటాయింపులో సహకరించిన పవన్ కళ్యాణ్, లోకేశ్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.