బాబు ఫ్యాన్స్ బాధలో న్యాయముంది కానీ….!

-

చాలా కాలంగా చంద్రబాబు రాజకీయాలు చూస్తున్నాం కానీ… ఇంత నిస్సత్తువుగా, ఇంత నిరాశగా ఎప్పుడూ కనిపించలేదని… ఇది వయసు పైబడటం వల్ల వచ్చిందా లేక… శేష జీవితంలో ఇక రెస్ట్ తీసుకుందామని భావిస్తున్నారా.. అదీగాక కొడుకు అసమర్ధతకు ఆయన అలకబూనారా అనేది అర్ధం కాక బుర్రలు గోక్కుంటున్నారు చాలా మంది బాబు ఫ్యాన్స్! ఈ విషయాలపై వారు ఎంత ఆరాతీస్తున్నా, ఎంతగా ఆలోచిస్తున్నా కూడా ఏమాత్రం ఆన్సర్ దొరకడం లేదు!! ఇంతకూ అసలు బాబుకు ఏమైంది… అక్కున చేర్చుకున్న ప్రాంతాలను సైతం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు?

2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం చంద్రబాబుకు కాస్తైనా మళ్లీ తేరుకునే అవకాశం రాలేదు, జగన్ ఇవ్వలేదు! కానీ… ఎంతైనా రాజకీయ పార్టీ కాబట్టి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడానికో లేక కనీసం తమ మనుగడ కాపాడుకోవడానికో ఒక అవకాశం కోసం చూడాలి! టీడీపీ కూడా అలా చూస్తుంది అని బాబు ఫ్యాన్స్ అనుకుంటున్న దశలో… కరోనా కాటేసింది! దీంతో… టీడీపీ జనాల్లోకి వస్తుంది, కాస్తో కూస్తో పసుపు వర్ణం కంటికి కనిపిస్తుంది అని బాబ్బు ఫ్యాన్స్ అంతా భావించారు! కానీ… రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా, ఎవ్వరూ చేయని విధంగా… కరోనా సమయంలో బాబు & కో ప్రవర్తించారు! తలుపు చాటు రాజకీయాలకే పరిమితమయ్యారు తప్ప జనాల్లోకి రాలేదు!

ఈ సమయంలో ప్రజల్లోకి వెళ్లడానికి మరో అవకాశం వచ్చింది టీడీపీ నేతలకు! అదే… విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన! ఫ్యాన్ గాలి గిరా గిరా తిరుగుతున్న సమయంలో కూడా విశాఖపట్నం సిటీ బాబును ఆదుకుంది… 4 సీట్లు కట్టబెట్టింది! ఆ పరిస్థితుల్లో ఇది బాబుకు మామూలు ఊరట కాదు! ఈ సిటీ కూడా కరుణించకపోతే… బాబు పరిస్థితి వేరేలా ఉండేది! కానీ… ఆ నలుగురిని కూడా బాబు ఈ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ సంఘటన సమయంలో సరిగ్గా వాడుకోలేకపోయారు!

ముఖ్యమంత్రి, మంత్రులు హుటాహుటిన జిల్లాలన్నీ దాటుకుని విశాఖకు చేరుకున్నారు కానీ, పక్కనే ఉన్న ఎమ్మెల్యేలలో గంటా శ్రీనివాసరావు, గణబాబు మినహా మిగతా ఇద్దరు దూరంగానే ఉన్నారు. వచ్చిన ఈ ఇద్దరిలో గణబాబు… ఏకంగా జగన్ ని పొగడటం మొదలుపెట్టారు! ఇది బాబుకు మరీ చేదు వార్త! ఈ పరిస్థితుల్లో విశాఖకు బాబు ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చి తీరాలి, అలా కాని పక్షంలో కనీసం లోకేశ్ అయినా రావాలి! కానీ… ఏదీ జరగలేదు! ఇంత క్లిష్ట సమయంలో కూడా బాబు రాకపోవడాన్ని విమర్శించిన వారికి మాత్రం… “మోడీ పర్మిషన్ దొరకలేదు… ట్రై చేస్తూ ఉన్నా” అని బాబు చెప్పడం హాస్యాస్పదమే కాదు, 40ఏళ్ల అనుభవం బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది కూడా! ఇంత అనుభవం ఉన్న బాబు… తన రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పలకరించడానికి వెళ్లాలంటే… అనుమతులు దొరకలేదనే సాకులు చెప్పడం ఎంత నిస్సుగ్గు వ్యవహారం!!

Read more RELATED
Recommended to you

Latest news