Chief Minister YS Jagan visited London: కుటుంబసమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారు సీఎం జగన్. లండన్ కు సీఎం జగన్ దంపతులు బయలుదేరారు. నిన్న రాత్రి లండన్ కు సీఎం జగన్ దంపతులు బయలుదేరారు. ఇక ఈ తరుణంలోనే… విదేశీ పర్యటనకు వెళ్తున్న సీఎం వైయస్ జగన్‌కు గన్నవరం విమానాశ్రయంలో మర్యాద పూర్వకంగా కలిశారు మంత్రులు.

సీఎం జగన్ ను కలిసిన వారిలో జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ విప్‌లు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సామినేని ఉదయభాను, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, మొండితోక అరుణ్ కుమార్, ఎమ్మెల్యే మల్లాది విష్టు ఉన్నారు.