టమోటాలతో ఐస్‌ క్యూబ్స్‌.. ఇలా చేసి ముఖానికి పెట్టారంటే అందం రెట్టింపే

-

మన వంటగదిలో ఉండే కూరగాయలతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పొందవచ్చు. ముఖ్యంగా టమాటాలు ఒక్కటి వాడితే చాలు.. మీ స్కిన్‌ సూపర్‌గా మెరిసిపోతుంది. టమోటాలను ఎన్నో రకలా ఫేస్‌ మాస్క్‌లలో వాడతారు. టామోట ధర పెరిగిందని మొన్నటివరకూ తెగ ఫీల్‌ అయి ఉంటారే.. ఇప్పడు ధర పడిపోయింది. అమ్మ వంటల్లో రెచ్చిపోతుంది. మనం ఎందుకు ఖాళీగా ఉండాలి. టమోటాలతో ఫేస్‌ ప్యాక్స్‌ వేసుకుని అందాన్ని రెట్టింపు చేసుకుందాం.! ఐస్‌ క్యూబ్స్‌ను ఫేస్‌కు అప్లై చేయడం వల్ల చర్మానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా పోర్స్‌ క్లోజ్‌ అవుతాయి, డార్క్‌ సర్కిల్స్‌, బ్లాక్ స్పాట్స్‌ ఇవన్నీ పోతాయి. టమోటాలతో చేసిన ఐస్‌ క్యూబ్స్‌ అప్లై చేస్తే.. బెనిఫిట్స్‌ డబుల్‌ అవుతాయి తెలుసా..?

టమాటో ఐస్ క్యూబ్స్ చేయడానికి కావలసిన పదార్థాలు:

2 టమోటాలు
1 చెంచా తేనె

టమాటో ఐస్ క్యూబ్స్ ఎలా చేయాలంటే..

ముందుగా 2 పండిన టమాటోలను తీసుకోండి. వీటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఇదే గిన్నెలో 1 స్పూన్ తేనె కలపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఐస్‌ అచ్చుల్లో వేసి 2 నుంచి 3 గంటలు రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయండి.
ఇలా చేస్తే టమాటో ఐస్ క్యూబ్స్ తయారైనట్లే..

టమాటో ఐస్ క్యూబ్స్‌ను ఎలా అప్లై చేయాలంటే..

ఎలాంటి ఫేస్‌ మాస్క్‌ అయినా సరే అప్లై చేసేముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. అప్పుడే రిజల్ట్‌ బాగుంటుంది. ఆ తర్వాత తయారు చేసి పెట్టుకున్న క్యూబ్‌ను ముఖానికి అప్లై చేయాలి. ఇలా సుమారు 10 నిమిషాల పాటు అప్లై చేసుకున్న తర్వాత బాగా మసాజ్‌ చేయండి.
ఇలా క్యూబ్స్‌ను వారానికి 1 నుంచి 2 సార్లు అప్లై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ముఖం వైట్‌గా మారుతుంది. పోర్స్‌ క్లోజ్‌ అవుతాయి. ఫేస్‌లో గ్లో వస్తుంది. పొడిబారిన చర్మం, జిడ్డు చర్మం సమస్య ఉన్నవాళ్లకు ఇది ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news