కూటమి ప్రభుత్వం లడ్డు విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుంటోంది. సుప్రీం ధర్మాసనం టిటిడి గురించి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉన్న అడ్వకేట్ సిద్ధార్థ్ లోత్రా సమాధానాలు చెప్పలేక చేతులెత్తేశాడు అని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ పేర్కొన్నారు. సుప్రీం కోర్ట్ మూడు ప్రశ్నలు అడగడం జరిగింది. లడ్డూను రాజకీయాల్లో కి ఎందుకు తీసుకొచ్చారు? కల్తీకి ఆధారాలు మీ వద్ద ఉన్నాయా? తొందరపడి నిర్ణయాన్ని ఎందుకు ప్రకటించారు? అని సుప్రీంకోర్టు ధర్మాసనం అడిగితే రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ నుంచి జవాబు లేదు.
మన తిరుపతిని, మన దేవస్థానాన్ని కూటమి ప్రభుత్వం బాగా వాడుకుంటోంది. నేను ఆనాడే చెప్పాను చంద్రబాబు లడ్డు విషయంలో మాట్లాడకుండా ఉంటే బాగుండేదని. టీటీడీ ఈవో శ్యామల రావు లడ్డు, నెయ్యి విషయంలో తొందరపడ్డారు. పప్పులో కాలేశాడు. జగన్ చూసి కూటమి ప్రభుత్వం భయపడుతోంది. తిరుపతిలో పోలీస్ రాజ్యం నడుస్తోంది. తిరుపతి నగరంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ఫ్లెక్సీలు, కటౌట్లు కనిపిస్తున్నాయి అని చింతా మోహన్ అన్నారు.