కృష్ణా జిల్లా, గుడివాడలో దారుణం చోటు చేసుకుంది. గుడివాడలో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. రైలుపేటలో జరిగిన ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. దీంతో చిన్నారికి గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో చికిత్సలు చేశారు. ఈ తరుణంలోనే…. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. అనంతరం ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు టూ టౌన్ పోలీసులు.
రైలు పేటలోని బాలిక ఇంటి వద్ద స్వయంగా విచారణ చేపట్టారు గుడివాడ డిఎస్పీ అబ్దుల్ సుబాన్. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి ఎండూరి జోజి బాబు (42)గా గుర్తించారు పోలీసులు. ఈ తరుణంలోనే ఆ కామాంధుడు ఎండూరి జోజి బాబును అదుపులో తీసుకున్నట్లు పోలీసు వర్గాల సమాచారం అందుతోంది. బాలిక ఇంటి సమీపంలోని రైసు బిల్లులో ముఠా కార్మికుడిగా పనిచేస్తున్నాడట జోజి బాబు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.