బీజేపీ మహిళా నేత మాధవీ లతకు క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి..!

-

బీజేపీ మహిళా నేత, నటి మాధవీ లతకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. ఒక మహిళా గురించి అలా మాట్లాడాల్సింది కాదు.. “నా వయస్సు.. ఆవేశం రిత్యా అలా మాట్లాడాను. ఆమెకు క్షమాపణలు చెబుతున్నాను”అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ తరుణంలోనే మంత్రి సత్య కుమార్ వ్యాఖ్యలపై జేసీ పరోక్షంగా స్పందించారు. తనను వైసీపీలోకి వెళ్లు అని చెబుతున్నారు. అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చారో చూసుకోవాలన్నారు.

అధికారం ఉన్నప్పుడు కాదు.. లేనప్పుడు మాట్లాడు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నామీద నమ్మకంతో 14వేల మంది మహిళలు వచ్చారు. ప్లెక్సీలు, ప్లాంపెట్ల లీడర్ ను కాదు.. జనం గుండెల్లో ఉన్న నేతను అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ” నా గురించి మాట్లాడిన వారంతా ప్లెక్సీ గాళ్లు. వీళ్లంతా అధికారం లేనప్పుడు ఎక్కడున్నారు” అంటూ జేసీ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version