సీఎంగా మీరు కొత్తేమో కానీ మీ పార్టీ కొత్త కాదు : ఈటల రాజేందర్

-

రాష్ట్ర ఆర్థిక స్థోమతకు మించి హామీలు ఇచ్చి ఇప్పుడు వాటి అమలు కోసం భూములు అమ్మకానికి పెట్టడం ఏంటని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొత్త కావచ్చు.. కానీ కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు.. అలాంటప్పుడు అనాలోచితంగా హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చేందుకు ప్రబుత్వ భూములే కాకుండా యూనివర్సిటీ భూములు అమ్మాలనుకునే పిచ్చి ప్రయత్నాలు చేయకూడదన్నారు.

ప్రభుత్వ భూములు ఏ ప్రబుత్వం అమ్ముకోవాలనే ప్రతిపాదనలు పెట్టినా తాను వ్యతిరేకించానన్నారు. హామీలు ఇచ్చిననాడు వాటిని ఎలా అమలు చేస్తారని అడిగితే కడుపు కట్టుకొని అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు భూములు అమ్ముతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అప్పనంగా అడ్డగోలుగా అమ్ముకోవాలని చూస్తే.. తాము కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ కలిస్తే వారు తక్షణమే స్పందించారన్నారు. ఈ విషయంలో  సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసు అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news