CM Chandrababu Naidu distributes pensions: ఏపీ పెన్షన్ దారులకు చంద్రబాబు నాయుడు సర్కార్ శుభవార్త అందించింది. ఇవాళ ఏపీ పెన్షన్ల పంపిణీ చేయనుంది చంద్రబాబు నాయుడు సర్కార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయనున్నారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/08/CM-Chandrababu-Naidu-distributes-pensions.webp)
ఉదయం 6 గంటల నుంచి లబ్ధిదారులకు నగదు పంపిణీ చేయాలని పలు జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రమంతటా సుమారు 65 లక్షల మందికి రూ. 2,730 కోట్ల మొత్తాన్ని సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి తిరిగి ఇవ్వనున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్వహించనున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.