హైదరాబాద్‌ లో రాత్రి నుంచి భారీ వర్షం..ఆ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ !

-

Heavy rain in Hyderabad since night: తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి నుంచి కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో నిన్న రాత్రి నుంచి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి హైదరాబాదులో ఇదే పరిస్థితి నెలకొంటుంది. ఈ మేరకు అధికారులు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ ప్రాంతవాసులు బయటకు రావద్దని సూచనలు చేస్తున్నారు.

Heavy rain in Hyderabad since night

ఇక ఖమ్మం, అదిలాబాద్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు అధికారులు అవసరం ఉంటే తప్ప ఈరోజు అస్సలు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news