చంద్రబాబు కీలక నిర్ణయం.. 1999లో తాను తీసుకొచ్చిన నిబంధన తానే తిరస్కరణ..!

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. ముఖ్యంగా 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సీఎంగా తీసుకొచ్చినటువంటి నిబంధన ఏంటంటే..? ఇద్దరూ కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు అనే నిబంధనను తీసుకొచ్చారు. కానీ తాజాగా ఈ నిబంధనను తిరస్కరిస్తూ ఏపీ క్యాబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది.

స్థానిక సంస్థలు, సహకార సంఘాలలో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హత నిబంధన తొలగించాలని క్యాబినెట్  నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన బిల్లుకు ఆమోదం తెలిపింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశ పెట్టనుంది ఏపీ ప్రభుత్వం. ముగ్గురు పిల్లల  నిబంధనను తప్పిస్తామని గత ఎన్నికల్లో కూటమి హామీ ఇచ్చింది. మరోవైపు  జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఎక్సైజ్ అవకతవకలపై సైతం కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. 2014-19, 2019-24 మధ్య తీసుకువచ్చిన ఎక్సైజ్ పాలసీలపై కూడా చర్చించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version