సీఎం చంద్రబాబు నాయుడు కడప టూర్ ఫిక్స్ అయింది. నేడు కడప జిల్లాకు సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. కడప పర్యటనలో భాగంగా పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు చంద్రబాబు నాయుడు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు.

ఇందులో భాగంగానే జమ్మలమడుగులోని గూడెం చెరువులో పెన్షన్ల పంపిణీలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు నాయుడు. టీడీపీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం కానున్నారు చంద్రబాబు. అటు చంద్రబాబు కడప పర్యటన నిమిత్తం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి . పోలీసుల బందోబస్తు కూడా బారీగానే ఉంది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు కడప టూర్ నేపథ్యంలో అడ్డుకుంటామని వైసీపీ నేతలు వార్నింగ్ ఇస్తున్నారు .