విశాఖ కేంద్రంగా బొత్స చక్రం తిప్పనున్నారా..? బొత్సకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్న వైసీపీ..

-

పోగొట్టుకున్న చోటే.. పై చెయ్యి సాధించాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారు.. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత.. సీనియర్లు అందరూ సైలెంట్ అయ్యారు.. జగన్ కూడా కొద్ది రోజులు సైలెంట్ అవుతారని అందరూ భావించారు..కానీ ఆయన మాత్రం.. పార్టీ పటిష్టత కోసం వ్యూహరచన చేస్తున్నారు.. సీనియర్లుకు కీలక బాధ్యతలు ఇచ్చి.. పార్టీని క్షేత్రస్థాయి నుంచిబలోపేతం చెయ్యాలని భావిస్తున్నారు.. బొత్సలాంటి సీనియర్ల సేవలను ఉపయోగించుకోవాలని ఆయన భావిస్తున్నారట..

వైసీపీలో అంతర్గత పరిమాణాలు వేగంగా మారుతున్నాయి.. విశాఖ కేంద్రంగా ఇక నుంచి బొత్స తన మార్క్ రాజకీయాలు ప్రారంభించబోతున్నారనే ప్రచారం పార్టీలో నడుస్తోంది.. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యతలను వైసీపీ అధినేత జగన్ ఆయన భుజాలమీద పెట్టారట.. అందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దింపి గెలిపించుకున్నారు జగన్.. గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ..కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా జగన్ పావులు కదుపుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.. మాజీ మంత్రులకు జిల్లాఅధ్యక్ష బాధ్యతలు ఇవ్వబోతున్నారు..

స్తానికంగా చక్రం తిప్పగలిగే కీలక నేతలకు పెద్ద పీట వేయ్యాలని వైసీపీ అధిష్టానం భావిస్తోందట.. విశాఖ మీద పట్టుసాధించాలని.. వైసీపీ మొదటి నుంచి వర్కౌట్ చేస్తున్నా..అది కలగానే మిగిలిపోయింది.. బొత్స సత్యానారాయణ ద్వారా విశాఖ జిల్లాను హస్తం గతం చేసుకోవాలని మాజీ సీఎం జగన్ సూపర్ స్కెచ్ వేస్తున్నారట.. అందులో భాగంగానే విశాఖపట్నం, విజయనగరం బాధ్యతలను బొత్స సత్యనారాయణకు అప్పగించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.. టీడీపీ కంచుకోటగా ఉన్న విశాఖలో పాగా వెయ్యాలంటే అది సీనియర్ నేతగా ఉన్న బొత్స వల్లే సాధ్యమని జగన్ భావిస్తున్నారట.. త్వరలో బొత్స ఆ రెండు జిల్లాల కేంద్రంగా రాజకీయం స్టాట్ చెయ్యబోతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news