కూటమి 8 నెలల పాలనపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రేపటికి నేను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి 8 నెలలు అవుతోందన్నారు చంద్రబాబు. ఐదేళ్ల వైసీపీ పరిపాలనను ప్రజలు అంగీకరించలేదని వివరించారు. మనపై విశ్వాసం ఉంచి భారీ మద్దతు ఇచ్చారన్నారు. ప్రతిసారీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడల్లా ఏదో ఒక సవాలు ఉంటుంది.. కానీ, ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి అని తెలిపారు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/CM-Chandrababu-launched-the-P-4-policy-with-the-main-objective-of-eradicating-poverty-in-AP.webp)
నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకే ప్రజలు అధికారమిచ్చారని వెల్లడించారు సీఎం చంద్రబాబు నాయుడు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునే విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని… త్వరితగతిన యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించి మిగతా నిధులు సాధించుకునేలా కార్యాచరణ చేపట్టాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతం వ్యవసాయం, ఉద్యాన రంగాలపై దృష్టి పెట్టి వృద్ధి రేటు సాధించేందుకు ప్రయత్నం చేయాలని ఆదేశించారు. ఉద్యాన రంగంతో పాటు వ్యవసాయంలోనూ విలువ జోడిస్తే ఎక్కువ సంపద ఆర్జించేందుకు ఆస్కారం ఉంటుందని… ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పైనా దృష్టి పెట్టాల్సి ఉందని తెలిపారు.