రైతులు, వరద బాధిత కుటుంబాలకు వెంటనే ఆర్థిక సాయం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. వరద తగ్గిన తరువాత ఆస్తి, పంటనష్టం వివరాలు సేకరించాలని… రైతులకు, వరద బాధిత కుటుంబాలకు వెంటనే సాయం అందించాలన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్న మంత్రులతో చంద్రబాబు టెలీ కాన్పరెన్స్ నిర్వహించారు. నిన్నటితో పోల్చుకుంటే జిల్లాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం వర్షాల తీవ్రత తగ్గిందని… ఇంకా వరదలోనే ఇళ్లు, కాలనీలు ఉన్నాయని చెప్పారు.
రహదారులపైనున్న నీటికి బయటకు పంపడమే కాదని… కాలనీలు, ప్రజల ఇళ్లలో ఉన్న వరద సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు. పలు ప్రాంతాల్లో 27 సెంటీమీటర్లకు పైగా వర్షం పడిందని… ఇలాంటి చోట్ల పరిస్థితిపై ఫోకస్ పెట్టాలన్నారు. 50 ఏళ్లలో ఎప్పుడూ పడనంతగా వర్షం పడిందని… ఎప్పుడూ లేని విధంగా నేషనల్ హైవేలు కూడా వరద నీటితో చెరువులను తలపించాయని వెల్లడించారు. నేషనల్ హైవే అథారిటీకి కూడా లేఖ రాసి సమస్యపై సమన్వయంతో పని చేయాలని… వరద ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పరిస్థితిని సమీక్షించండని కోరారు చంద్రబాబు.