Cm Jagan: సీఎం జగన్‌ ఇవాళ్టి బస్సుయాత్ర షెడ్యూల్‌ ఇదే

-

Cm Jagan: సీఎం జగన్‌ ఇవాళ్టి బస్సుయాత్ర షెడ్యూల్‌ విడుదల అయింది. మేమంతా సిద్ధం – 21వ రోజు షెడ్యూల్ ప్రకారం… వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉదయం 9 గంటలక ఎండాడ MVV సిటీ రాత్రి బస నుంచి బయలుదేరి మధురవాడ, మీదుగా ఆనందపురం చేరుకుని చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు.

cm jagan 21st bus trip

జొన్నాడ దాటిన తర్వాత భోజన విరామం తీసుకుని బొద్దవలస మీదుగా సాయంత్రం 3:30 గంటలకు చెల్లూరు వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలస రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.

Read more RELATED
Recommended to you

Latest news