ప్రధాని మోడీ భీమవరం టూర్ కు సీఎం జగన్ దూరం!

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ జూలై 4న భీమవరం వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక రోజు టూర్ లో భాగంగా భీమవరం వచ్చే ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి హోదాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ప్రధాని మోదీ పర్యటన కళతప్పే అవకాశం కనిపిస్తోంది.

ప్రధాని మోదీ భీమవరం పర్యటనకు షెడ్యూల్ ప్రకారం సీఎం జగన్ హాజరు కావాల్సి ఉంది. అయితే జగన్ తన కుమార్తె స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈనెల 28న రాత్రి బయలుదేరి వెళ్ళిబోతున్నారు. జూలై 2న తన కుమార్తె స్నాతకోత్సవ కార్యక్రమంలో జగన్ హాజరవుతారు. ఆయన జూలై 5న అమరావతికి తిరిగి వస్తారు. దీంతో ప్రధాని టూర్ కు ఆయన దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రధాని కార్యాలయానికి సమాచారం కూడా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సీఎం జగన్ లేకుండానే ఈ కార్యక్రమం జరిగే అవకాశాలున్నాయి.