ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక రాజధాని విశాఖలో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీక్ కావడంతో దాదాపు 5 కిలోమీటర్ల మేర విష వాయువులు విస్తరించాయి. విశాఖలో ఇప్పటి వరకు 5 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మందిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. కాసేపట్లో ఏపీ సిఎం వైఎస్ జగన్ విశాఖ వెళ్లనున్నారు.
ప్రజలకు చికిత్స వెంటనే అందించాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఆస్పత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించడానికి ఆయన రెడీ అయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. సహాయక చర్యలను ఆయన పర్యవేక్షిస్తారు. గ్యాస్ లీక్ తో చెట్లు కూడా వాడిపోయాయి. ఊపిరి ఆడక పలు మూగజీవాలు కూడా ప్రాణాలు కోల్పోయాయి. వందల మందిని ఇప్పుడు వేగంగా ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
సహాయక చర్యలను వేగవంతం చెయ్యాలని జగన్ ఆదేశించారు. ఆయన హెలికాప్టర్ లో విశాఖ వెళ్తారు. అక్కడి అధికారులతో మంత్రులతో జగన్ మాట్లాడుతున్నారు. గ్యాస్ లీకేజీ ఆగినా సరే పరిస్థితి మాత్రం అదుపులోకి రాలేదు. ఈ పరిస్థితిని కొంత మంది భోపాల్ గ్యాస్ దుర్ఘటనతో పోలుస్తున్నారు. అప్పుడు 5 లక్షల మంది మరణించారు. రోడ్ల మీద జనాలు పడి ఉండటం ఆందోళన కలిగిస్తుంది.