చైనాను వదిలేయండి; కేంద్రానికి కేటిఆర్ సూచన…!

-

తెలంగాణా పరిశ్రమల, ఐటి శాఖా మంత్రి కేటిఆర్ కేంద్ర కెమికల్స్, ఫెర్టిలైజర్స్ శాఖ మంత్రి వి. సదానందగౌడకు లేఖ రాసారు. ఈ అంశంలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచమంతా ఎదుర్కొంటున్న సంక్షోభ కాలంలోనూ, దాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైన మందులను తయారు చేస్తూ, సరఫరా చేస్తూ దేశ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అందరికీ గర్వకారణంగా నిలిచిందని ఈ లేఖలో ప్రస్తావించారు.

ప్రస్తుతం తెలంగాణ భారతదేశ ఫార్మాస్యూటికల్ హబ్ గా కొనసాగుతున్నదని అని ఆయన చెప్పారు. సుమారు 800 లైఫ్ సైన్సెస్ కంపెనీలు తెలంగాణలో ఉన్నాయని, 35% కంటే ఎక్కువగా జాతీయ ఉత్పత్తిలో తెలంగాణ నే అందిస్తుందని లేఖలో వివరించారు. ఈ రంగంలో సుమారు లక్షా 20 వేల మందిని ఉపాధి కల్పిస్తుందని అన్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ రంగానికి దాని అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తన పరిధిలో అవసరమైన మేర కృషి చేస్తూ వస్తుందన్నారు ఆయన.

ప్రస్తుతం లాక్ డౌన్ పరిస్థితుల కాలంలో వాటి ఉత్పాదన సామర్ధ్యంతో పోల్చితే తక్కువ కెపాసిటీతో నడిపించడం, లేబర్ కొరత వంటి సమస్యల వలన అనేక సవాళ్లు ప్రస్తుతం ఫార్మా రంగం ఎదుర్కొంటుందని వివరించారు. ఫార్మాస్యూటికల్ రంగం లో 80% చిన్న మధ్య తరహా కంపెనీల ఉన్నందున, వాటికి ప్రస్తుత సంక్షోభ కాలంలో ప్రభుత్వ మద్దతు ఎంతో అవసరమని ఆయన లేఖలో వివరించారు.

ప్రస్తుతం తాను సూచిస్తున్న కొన్ని సంస్కరణలు ఇతర చర్యల వలన ఆయా రంగం యొక్క ప్రగతి తో పాటు ప్రపంచంలో భారత ఫార్మా రంగ నాయకత్వ స్థానం మరింత సుస్థిరం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి ఫార్మా రంగం యొక్క ప్రతినిధులతో పలుమార్లు చర్చించిన తర్వాత ఈ లేఖ రాసా అని ఆయన వివరించారు.

పాలనా, పన్ను, నియంత్రణ సంస్కరణలు చేపట్టాలని, నూతన ఫార్మస్యూటికల్ పాలసీని తీసుకురావాలని సూచించారు. ఇతర దేశాల నుంచి వచ్చే కంపెనీ పెట్టుబడులను అకర్షించాలని పేర్కొన్నారు. చైనా పైన ముడి సరుకుల కోసం అధారపడడం తగ్గించాలని సూచించారు. భారత ఎంఎస్ఎంఈ ఫార్మా కంపెనీలకు పెద్ద ఎత్తున సహకారం అందించాలన్నారు. భారతదేశ ఫార్మా రంగంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను మరింత పెంచేందుకు ఆ రంగంలోని నిపుణులతో ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version