విద్యార్థులకు జగన్ తీపికబురు. ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్, ఇంటర్ లో చేరాలనుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల కోసం పేరు నమోదు చేసుకోవడంతో పాటు పరీక్ష ఫీజులను చెల్లించే వెసులుబాటును తీసుకొచ్చింది.
వచ్చేవారం నుంచి ఈ సేవలో అందుబాటులోకి రానున్నాయి. ఓపెన్ స్కూల్ ప్రవేశాల ప్రక్రియ ఏటా నవంబర్ నెలఖరు వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
ఇక అటు ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ముమ్మరంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని…సెప్టెంబ ర్ 15 నుంచి ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అంతా సిద్ధం చేసుకోవాలన్నారు. ఏపీలో వైద్య ఆరోగ్యశాఖ పనితీరుపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్స చేసిన రోగులకు వైద్యులు సూచించిన విశ్రాంతి సమయంలో వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం కింద నెలకు రూ. 5000 వరకు జీవనభృతి ఇస్తున్నామన్నారు.