ఇల్లు కట్టుకునే.. వారికి గుడ్‌న్యూస్ చెప్పింది జగన్ ప్రభుత్వం. రెండేళ్ల క్రితం నిర్మాణం ప్రారంభించి… నిలిపివేసిన ఇళ్లకు సంబంధించిన జగన్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ దశల్లో ఆగిన పనులు తిరిగి చేపట్టేందుకు అడ్వాన్స్ గా రూ. 20,000 ఇస్తామంది.
ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు ఇచ్చే రూ. 1.80 లక్షల నుంచి రూ. 20,000 మినహాయిస్తారు. పెరిగిన ఖర్చులతో పలువురు లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులు నిలిపివేయగా… తాజా నిర్ణయంతో కొందరైనా ముందుకొస్తారని ప్రభుత్వం భావిస్తోంది.
అటు ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం అమలుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. జూలై 1న రాష్ట్రంలోని 1297 గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారు. అర్హులై ఉండి పథకాలు అందని వారికి ‘జగనన్న సురక్ష’ ద్వారా లబ్ధి చేకూర్చనున్నారు. మొత్తం 15,000 సచివాలయాల్లో నిర్దేశిత తేదీల్లో క్యాంపులు నిర్వహిస్తారు. వారం ముందే క్యాంపు తేదీలపై మైక్ లో ప్రచారం చేసి లబ్ధిదారులకు టోకెన్లు జారీ చేయనున్నారు.