600 కార్లతో మహారాష్ట్రకు బయల్దేరిన సీఎం కేసీఆర్

-

జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్​ను విస్తరించేందుకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. బీఆర్ఎస్​ ఆవిర్భావం నుంచి మహారాష్ట్రపై కేసీఆర్ నజర్ పడిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్పటికే పలుమార్లు కేసీఆర్ మహారాష్ట్రలో పర్యటించి.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొన్నారు. తెలంగాణ మాదిరి.. మహారాష్ట్ర ను కూడా మోడల్​గా మారుస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా రైతులకు లబ్ధి చేకూర్చే పథకాలు ప్రవేశపెడతామని మాటిచ్చారు.

ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో బీఆర్ఎస్ కార్యకలాపాలు మరింత విస్తరించేందుకు ఆ రాష్ట్రంలో కేసీఆర్ రెండ్రోజులు పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం ప్రగతి భవన్ నుంచి 600 వాహనాలతో కూడిన భారీ కాన్వాయ్​తో బస్సులో కేసీఆర్ మహారాష్ట్రకు  బయల్దేరారు. సీఎం వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు వెళ్లారు. కేసీఆర్ కాన్వాయ్ వెళ్తుండగా.. పలుచోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు స్వాగతం పలుకుతున్నారు. ఇవాళ సాయంత్రం సోలాపూర్ చేరుకోనున్న కేసీఆర్.. రాత్రి అక్కడే బస చేసి రేపు సోలాపూర్‌లో పార్టీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news