ఏపీ ఉద్యోగులకు జగన్ అదిరిపోయే శుభవార్త..సంక్రాంతికే డీఏ చెల్లింపు !

-

ఏపీ ఉద్యోగులకు జగన్ అదిరిపోయే శుభవార్త అందింది. ఉద్యోగులకు సంక్రాంతికి ఒక డిఏ ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు ఏపీ ఐకాన్ చైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు. కొత్త పిఆర్సి కమిటీ ఏర్పాటు, గతేడాది 2 డిఏలు ఇవ్వాలని కోరామని వెల్లడించారు.

cm jagan

ఏప్రిల్ నుంచి బకాయిలు చెల్లిస్తారని పేర్కొన్నారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం జగన్ ను ఏపీ ఐకాస్ నేతలు కలిశారు. పలు డిమాండ్లపై వినతి పత్రం సమర్పించారు. అనంతరం బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ, ‘గత రెండేళ్లుగా ఉద్యోగులకు బకాయిగా ఉన్న రూ.10వేల కోట్లను విడుదల చేయాలని కోరగా, సీఎం సానుకూలంగా స్పందించారు. ఉపాధ్యాయులకు బదిలీల ప్రక్రియ చేపడతామన్నారు’ అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version