ఏపీ ఉద్యోగులకు శుభవార్త..మే నెలలో బదిలీల ప్రక్రియ

-

ఏపీ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు సీఎం జగన్‌. మే నెలలో ఉద్యోగుల బదిలీలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకట రామిరెడ్డి తెలిపారు. పెండింగ్ డీఏలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి జగన్ ను కోరామని.. ఈ నెలలో డీఏ ఉత్తర్వులు జారీ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని వివరించారు.

cm jagan

ఉద్యోగుల సాధారణ బదిలీలకు అనుమతించాలని కోరామని.. మే నెలలో ఉద్యోగుల బదిలీలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారని వివరించారు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకట రామిరెడ్డి. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా ఈ బదిలీలలో అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ హామీ ఇచ్చారన్నారు. ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి జగన్‌ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పినట్లు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకట రామిరెడ్డి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version