ఏపీలో అమలు చేస్తున్న పథకాలతో గడిచిన మూడేళ్లలో రూ.3.30 లక్షల కోట్లు అందించామని ప్రకటించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. లంచాలు లేకుండా అర్హులకు పథకాలు అందిస్తున్నాం.. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు వసూళ్లకు పాల్పడ్డాయి.. ఏ పథకం రావాలన్నా ఆ కమిటీలకు లంచం ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారింది.. మధ్యవర్తులు లేకుండా లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తామని చెప్పారు వైఎస్ జగన్.
రీ వెరిఫికేషన్ లేకుండా పింఛన్లు తీసివేయబోమని పేర్కొన్నారు సీఎం జగన్. వివిధ కారణాలతో పథకాలు మిగిలిపోయిన అర్హులకు జగన్ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2,79,065 మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ.590.91 కోట్లు జమ చేశారు సిఎం జగన్. అనంతరం సిఎం జగన్ మాట్లాడుతూ, పింఛన్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. అనర్హులకు రాకూడదు, ఇవ్వకూడదు.. నోటీసులు ఇస్తారన్నారు. రీసర్వే చేసి చర్యలు తీసుకుంటారు.. నోటీసులు ఇస్తేనే పింఛన్లు తీసేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. రీ వెరిఫికేషన్ లేకుండా చర్యలు తీసుకోరని క్లారిటీ ఇచ్చారు ఏపీ సీఎం జగన్. లంచాలు లేకుండా అర్హులకు పథకాలు అందిస్తున్నాం.. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలు వసూళ్లకు పాల్పడ్డాయని అగ్రహించారు సిఎం జగన్ మోహన్ రెడ్డి