ఏపీ టీచర్లకు బిగ్ షాక్.. బదిలీలకు వారు అనర్హులు

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ల బదిలీలకు గడువు నిన్నటితో ముగియడంతో బదిలీ అయ్యేందుకు 75వేల మంది అప్లై చేసుకున్నారు. వీరిలో తప్పనిసరి బదిలీ కోసం 32వేల మంది ఉన్నారు. అయితే గతేడాది టెన్త్ ఎగ్జామ్ లో మాస్ కాపీయింగ్ కు సహకరించిన క్వశ్చన్ పేపర్ ను వాట్సాప్ లో షేర్ చేసిన టీచర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోగా, మరికొందరిపై కేసులు నమోదయ్యాయి.

వీరు బదిలీ అయ్యేందుకు అనర్హులని ప్రభుత్వం తేల్చి చెప్పింది. కాగా, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీ షెడ్యూల్ విడుదలైంది. మే 29 నుంచి జూన్ 3 వరకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ప్రస్తుతం హాజరు నమోదు చేసే HRMS పోర్టల్ లోనే బదిలీల అప్లికేషన్లకు ప్రత్యేక లింక్ అందుబాటులో ఉంచుతామన్నారు. అవసరమైన సర్టిఫికెట్లపై సంతకాలు చేసి అప్లోడ్ చేయాలని సూచించారు. మే నాటికి జిల్లాల వారీగా ఉద్యోగ కే టగిరీల వారిగా, ఖాళీల వివరాలను పోర్టల్ లో ఉంటాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news