స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అదిరే ఆఫర్… జూన్ 30 వరకే ఛాన్స్..!

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. స్టేట్ బ్యాంక్ అందించే సేవల వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. కొత్తగా ఎవరైనా హోమ్ లోన్ ని తీసుకోవాలని అనుకుంటే వాళ్లకి అదిరే ఆఫర్ ని ఒకటి అందుబాటులోకి తీసుకొచ్చింది. వడ్డీ రేట్లను తగ్గిస్తూ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది.

దీంతో కొత్తగా లోన్ తీసుకునే వారితో పాటు ఇప్పటికి ఉన్న రుణాలను రెన్యూవల్ చేసుకునే వారికి తగ్గించిన వడ్డీనే వర్తిస్తుంది. హోమ్ లోన్స్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 45 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గిస్తోంది. ఈ మేరకు ప్రకటన కూడా చేసింది. ప్రస్తుతం 9.15 శాతంగా ఉన్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఆఫర్‌లో 8.70 శాతం కి మాత్రమే.

క్రెడిట్ స్కోరు 750 పాయింట్ల కన్నా ఎక్కువ ఉన్న వారు మాత్రమే ఈ ఆఫర్ ని పొందేందుకు అవుతుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఇతర బ్యాంకుల్లో గృహ రుణాలు తీసుకుంటే వాళ్ళు స్టేట్ బ్యాంకుకు మారాలనుకుంటే వారికి వడ్డీ రేటులో అదనంగా 20 బేసిస్ పాయింట్ల తగ్గింపు ఉంటుంది. ఆ కస్టమర్లకు 8.50 శాతం వడ్డీకే లోన్ వస్తుంది. అసలు వడ్డీ రేటుకన్నా 65 బేసిస్ పాయింట్లు కి ఇది తక్కువ. హోమ్ లోన్లపై ఎస్‌బీఐ అందిస్తున్న వడ్డీ రేట్ల తగ్గింపు ఆఫర్ జూన్ 30 వరకు మాత్రమే వుంది.