విద్యారంగంలో కీలక మార్పులకు సీఎం జగన్ అడుగులు

-

ఉన్నత విద్యపై ఫోకస్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ మేరకు నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సిలర్లతో సమావేశమయ్యారు. విశ్వవిద్యాలయాలకు సంబంధించిన సమస్యలపై క్యాంప్ కార్యాలయంలో చర్చ కొనసాగుతోంది. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సిలర్లు, ఉన్నత విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

ys jagan

ఈ సమావేశంలో విద్యారంగంలో కీలక మార్పులపై చర్చిస్తున్నారు సీఎం జగన్. బోధన, నైపుణ్య అభివృద్ధిలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనుసంధానం పై సీఎం జగన్ కీలక దృష్టి సారించారు. ఏఐ, వర్చువల్ రియాల్టీ, అగ్మెంటేషన్ రియాల్టీలను బోధనలో వాడుకోవడం పై దృష్టిపెట్టారు. ఇదే సమయంలో ఈ రంగాలలో క్రియేటర్లుగా విద్యార్థులను తయారు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో పాఠశాల విద్య, ఉన్నత విద్యలో కీలక మార్పులు చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Latest news