తాడేపల్లి: మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్ సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చారని అన్నారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్. వృద్ధులకు ఒకటో తేదీనే ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తుంటే పవన్ కళ్యాణ్ విషం కక్కుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు జన్మభూమి కమిటీలు పచ్చజెండా కట్టుకుంటే కానీ పథకాలు అందించే వారు కాదని ఆరోపించారు. లంచం ఇవ్వకుండా జన్మభూమి కమిటీలు పని చేసేవి కావన్నారు. నమస్కారానికి కూడా సంస్కారం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని తీవ్ర విమర్శలు చేశారు.
వాలంటీర్లు ఉద్యమిస్తే ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ రుచి చూశాడని అన్నారు. నిఘా వర్గాలు సమాచారం ఇవ్వటానికి పవన్ కళ్యాణ్ రాజ్యాంగేతర శక్తా? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కు ఎంత మంది పిల్లలు ఉన్నారని ప్రశ్నించారు. ఒకరు ఉంటే భార్య అంటారు.. నలుగురు, ఐదుగురు ఉంటే పెళ్ళాలు అనే అంటారని ఎద్దేవా చేశారు. నీ రెండో సహధర్మచారి రేణూ దేశాయ్ నే స్వయంగా మీడియా ఇంటర్వ్యూలో చెప్పారని.. ఒక భార్య ఉండగా ఇంకో అమ్మాయితో భర్త పిల్లలను కంటే ఎలా ఉంటుందో మీరే ఆ స్థానంలో ఉండి ఆలోచించండి అని చెప్పిన విషయాన్ని రాష్ట్రం అంతా చూసిందన్నారు.