కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ కి కృతజ్ఞతలు తెలిపిన సీఎం జగన్

-

తిరుపతిలో జరిగిన కార్మికశాఖ మంత్రుల జాతీయ సదస్సును ఉద్దేశించి.. సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో మాట్లాడారు సీఎం వైఎస్‌ జగన్‌. పారిశ్రామికవేత్తలకు, కార్మికులకు మేలు చేసేలా కార్మిక చట్టాల రూపకల్పన, బలోపేతంలో ఈ సదస్సు ద్వారా చేసిన మేధోమధనం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక జాతీయ సదస్సుకి తిరుపతిని వేదికగా చేసిన కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు. ఈ సదస్సుకి వచ్చిన అందరికీ తిరుమల బాలాజీ దీవెనలు ఉంటాయని భావిస్తున్నానన్నారు. గడిచిన రెండు రోజులుగా ఈ సదస్సులో చర్చించిన అంశాలు కార్మిక చట్టాల పటిష్టతకు మరింతగా ఉపయోగపడతాయని భావిస్తున్నానని అన్నారు సీఎం జగన్.

పారిశ్రామికవేత్తలకు, కార్మికులకు మేలు చేసేలా కార్మిక చట్టాల రూపకల్పన, బలోపేతంలో ఈ సదస్సు ద్వారా చేసిన మేధోమధనం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో ఈ సదస్సు జరగడం ఆనందదాయకం.. అంతేకాక ఇది గౌరవంగా భావిస్తున్నామని అన్నారు. సదస్సులో క్యాంపు కార్యాలయం నుంచి హాజరైన వారిలో చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ, సీఎంవో అధికారులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news