నేడు కర్నూలు జిల్లా లక్కసాగరం వద్ద పంప్ హౌస్ ప్రారంభోత్సవం చేయనున్నారు సీఎం జగన్. ఇందులో భాగంగానే నేడు కర్నూలు జిల్లా లక్కసాగరంలో సిఎం జగన్ పరతించనున్నారు. ఈ సందర్భంగా లక్క సాగరం వద్ద పంప్ హౌస్ ప్రారంభోత్సవం చేయనున్నారు సీఎం జగన్.
డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లోని 77 చెరువులకు హంద్రీ-నీవా నీటిని మళ్లించి కరువు సీమ దాహార్తి తీర్చడంతో పాటు కృష్ణా జలాలతో సస్యశ్యామలం చేసే సంకల్పంతో… కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం లక్క సాగరం వద్ద 224,31 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్నిప్రారంభోత్సవం చేయనున్నారు సీఎం జగన్.
ఇక ఈ కార్యక్రమం అనంతరం నంద్యాల జిల్లా, డోన్లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు సీఎం జగన్. కాగా లక్కసాగరం వద్ద పంప్ హౌస్ ప్రారంభోత్సవం కారణంగా డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాల్లో చెరువులకు జలకళ రానుంది. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి తాగు, సాగునీటి సరఫరా జరుగనుంది. 10,394 ఎకరాలకు సాగు నీరు అందనుంది.