రేపు, ఎల్లుండి తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన

రేపు, ఎల్లుండి సీఎం వైఎస్‌ జగన్‌ తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాలలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగానే.. రేపు మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి చేరుకోనున్న సీఎం జగన్.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం శ్రీనివాస సేతు ప్రారంభోత్సవం, ఎస్‌ వి ఆర్ట్స్‌ కాలేజ్‌ హాస్టల్‌ బిల్డింగ్‌ వర్చువల్‌ గా ప్రారంభోత్సవం, టీటీడీ ఉద్యోగులకు ఇళ్ళ పట్టాల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

cm jagan on chandrababu arrest
cm jagan on chandrababu arrest

తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకుని గంగమ్మను దర్శనం చేసుకోనున్న సీఎం జగన్‌ అనంతరం తిరుమలకు వెళతారు. అనంతరం బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని అక్కడి నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ప్రధాన ఆలయానికి చేరుకోనున్నారు సీఎం జగన్‌. అనంతరం వాహన మండపం చేరుకుని పెద్ద శేష వాహనం దర్శనం చేసుకుంటారు. రాత్రికి పద్మావతి అతిధి గృహంలో బస చేస్తారు. ఎల్లుండి ఉదయం 6.20 గంటలకు శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకోనున్న సీఎం జగన్… అక్కడి నుంచి కర్నూలు జిల్లా కు సీఎం జగన్ ప్రయాణం కానున్నారు. కృష్ణగిరి మండలం లక్కసాగరం చేరుకోనున్న ముఖ్యమంత్రి జగన్‌… డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాలకు సంబంధించి తాగు, సాగునీరందించే పథకాలను ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.