కవితను కేసీఆర్ జైలుకు పంపుతారు: రేవంత్ రెడ్డి

కవితను కేసీఆర్ జైలుకు పంపుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.  మద్యం కేసులో బీజేపీ, బీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘కవితను జైలుకు పంపి వచ్చే ఎన్నికల్లో సానుభూతి పొందాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంపై ఇవాల్టి వరకు ఈడి, సిబిఐ కాదు.. ఈగ కూడా వాలలేదు.

మోడీ, షా, నడ్డా విమర్శలు చేస్తారు కానీ….ఒక్క కేసు కూడా పెట్టలేదు. కేసీఆర్, కిషన్ రెడ్డి వేరు కాదు. కిషన్ రెడ్డి… కేసీఆర్ అనుచరుడే’ అని వాక్యానించారు. కేజ్రీవాల్ మీద విచారణ చేస్తూ ఉంటే..కవిత దొరికిందని..టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం మీద ఈగ కూడా వాలలేదని బీజేపీ పై ఆగ్రహించారు. సీఎం కేసీఆర్ అవినీతి పరుడు అని బీజేపీ చెప్తుంది ఎందుకు విచారణ చేయట్లేదని.. కేసీఆర్ అవినీతి మీద ఎందుకు విచారణ చేయలేదని నిలదీశారు. సీఎం కేసీఆర్ కు కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని…100 పిటిషన్లను ఇచ్చాం ..ఎందుకు స్పందించలేదని కేంద్రం పై ఆగ్రహించారు రేవంత్ రెడ్డి.