ఇవాళ చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ కానుంది. జగనన్న పాలవెల్లువ పథకంలో భాగంగా కీలక అడుగు వేస్తోంది జగన్ సర్కార్. గత 20 ఏళ్ళుగా మూతబడి ఉంది చిత్తూరు డెయిరీ. అమూల్ సంస్థ ద్వారా పునరుద్ధరణకు శ్రీకారం చుట్టింది జగన్ సర్కార్.
ఇందులో బాగంగానే ఇవాళ ఉదయం చిత్తూరు డెయిరీ పునరుద్ధరణకు భూమి పూజ చేయనున్నారు సీఎం జగన్. అమూల్ సంస్థ ద్వారా 385 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. 10 నెలల్లో ఉత్పత్తి ప్రారంభించే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు. 150 కోట్ల వ్యయంతో దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం ప్లాంటు నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో ప్రత్యక్షంగా 5 వేల మందికి, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి కలుగనుంది. అలాగే 25 లక్షల మంది పాడి రైతులకు లబ్ది చేకూరనుంది.