నేటి నుంచి 3 రోజుల పాటు కడప జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

-

సీఎం జగన్‌ కడప జిల్లా పర్యటన ఫిక్స్ అయింది. నేటి నుంచి 3 రోజుల పాటు కడప జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన కొనసాగనుంది. కడప జిల్లా పర్యటన లో పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు సీఎం జగన్. నేడు గోపవరంలో సెంచురీ ప్లై పరిశ్రమలోని ఎండీఎఫ్, హెచ్‌పీఎల్‌ ప్లాంట్‌లను ప్రారంభోత్సవం లో పాల్గొంటారు సీఎం జగన్‌.

CM Jagan will be in Vijayawada tomorrow

అనంతరం కడప రిమ్స్‌ వద్ద డాక్టర్‌ వైఎస్సార్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్‌ వైఎస్సార్‌ ఇన్సిట్యూట్ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌, డాక్టర్‌ వైఎస్సార్‌ క్యాన్సర్‌ కేర్‌ బ్లాక్‌ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు సీఎం జగన్‌. ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొంటారు సీఎం జగన్‌. వైఎస్‌ రాజారెడ్డి క్రికెట్‌ స్టేడియంలో ఫ్లడ్‌ లైట్లను ప్రారంభించనున్నారు సీఎం జగన్‌. రాత్రికి ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌లో బస చేయనున్న సీఎం జగన్‌…3 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటిస్తారు

Read more RELATED
Recommended to you

Latest news